కోల్‌కత్తా: ఇంగ్లాండుతో తలపడే భారత క్రికెట్ జట్టుకు సౌరబ్ గంగూలీయే నాయకత్వం వహిస్తాడు. భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీని మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టు ఇంగ్లాండుతో మూడు టెస్టు మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. వన్డే మ్యాచ్‌లకు, టెస్టు మ్యాచ్‌లకు కూడా గంగూలీయే కెప్టెన్‌గా వుంటాడు. భారత జట్టుతో తలపడడానికి ఇంగ్లాండు జట్టు ఇప్పటికే భారత్‌కు వచ్చింది.

ఇంగ్లాండుతో ఆడే భారత జట్టును బుధవారం ఎంపిక చేయనున్నట్లుసెలెక్షన్ కమిటీ చైర్మన్ చందు బోర్డే చెప్పారు. మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ భారత బ్యాట్స్‌మన్‌వీరేంద్ర షెహవాగ్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. దీంతోషెహవాగ్ ఇంగ్లాండుతో మొహలీలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడబోడని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులోషెహవాగ్ అడడం లేదని, అందువల్ల ఇంగ్లాండుతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కుషెహవాగ్ అర్హుడేనని బిసిసిఐ వాదిస్తోంది. భారత, ఇంగ్లాండుల మధ్య తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన ప్రారంభమవుతుంది.

Click it and Unblock the Notifications