లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి మధ్యవివాదం మరింత ముదిరింది. ఇంగ్లాండుతో ఆడే జట్టులో భారత బ్యాట్స్‌మన్‌వీరేంద్ర షెహవాగ్‌ను ఎంపిక చేస్తున్నారా, లేదా తెలియజేయాలని ఐసిసి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మాల్కం స్పీడ్ బిసిసిఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాను అడిగారు. ఈ మేరకు ఆయన దాల్మియాకు ఆరుపేజీల లేఖ రాశారు.

వచ్చే వారం ఇంగ్లాండుతో జరిగే మొదటి టెస్టులోవీరేంద్ర షెహవాగ్ ఆడకూడదని స్పీడ్ సూచించారు. అలా ఆడిన పక్షంలో ఆ టెస్టు మ్యాచ్‌కు కూడా అంతర్జాతీయ గుర్తింపు వుండదని ఆయన అన్నారు. ఈవిషయమై ఈ నెల 30వ తేదీ లోగా ఐసిసికి వివరణ ఇవ్వాలని ఆయన అడిగారు.
దక్షిణాఫ్రికాతో సెంచ్యూరియన్ పార్క్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ను తాము గుర్తించడం లేదని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికా 1-0 తేడాతో భారత్‌పై గెల్చినట్లు ప్రకటించాలని మ్యాచ్ రెఫరీకి సూచించినట్లు ఆయన తెలిపారు.వివాదానికి సాధ్యమైనంత త్వరగా తెర దించాలని ఆయన సూచించారు.

Click it and Unblock the Notifications