హోమ్ పేజి
విశాఖపట్నంః మహిళల పట్ల వివక్షపూరిత విధానాలను అమలు చేస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం రాజీనామా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. విశాఖపట్నంలో జాతీయ సదస్సును జరుపుకుంటున్న ఈ సంఘం ఎన్‌డిఎ ప్రభుత్వం మహిళల విషయంలో కరుడుకట్టిన వివక్షను ప్రదర్శిస్తున్నదని ఆరోపించింది.
బిజెపి నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లును అటకెక్కించారని సదస్సు దుయ్యబట్టింది. ఎన్‌డిఎ ప్రభుత్వం మహిళల హక్కుల పరిరక్షణలో విఫలమైందని ప్రభుత్వం రాజీనామా చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని మహిళా సంఘం నేత బృందాకారత్ స్పష్టం చేశారు. తమ సంఘంలో 59 లక్షల మంది సభ్యులు వున్నారని ఈ సంఖ్యను రానున్న రోజుల్లో మరింత పెంచాలని నిర్ణయించామని ఆమె వెల్లడించారు.












Click it and Unblock the Notifications
