హోమ్ పేజి
న్యూఢిల్లీః బిజెపి పార్లమెంట్ సభ్యుడు విష్ణుదత్ మంగళవారం నాడు ఢిల్లీలో మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ పార్లమెంట్ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు.
జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దత్ వయస్సు 75 ఏళ్లు. దత్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వయోభారాన్ని లెక్కచేయకుండా రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వశాఖలకు చెందిన సంప్రతింపుల కమిటీల్లో దత్ చురుగ్గా పాల్గొనేవారని లోక్‌సభ స్పీకర్ బాలయోగి చెప్పారు. దత్ ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు కూడా. ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. గత ఏడాది కాలంగా ఆయన కాన్సర్‌తో బాధపడుతున్నారు.












Click it and Unblock the Notifications
