హోమ్ పేజి
హైదరాబాద్‌ః ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి వచ్చే ఆదివారం నాడు హైదరాబాద్ సందర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రారంభోత్సవం కోసం ప్రధాని వస్తున్నట్టుగా అధికారవర్గాలు చెప్పాయి.
ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక విమానం బేగంపేట్‌కు చేరుకుంటుందని అక్కడినుంచే ఆయన నేరుగా హెలికాప్టర్లో గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్తారని తెలిసింది. హైదరాబాద్‌లోనే నిర్మించనున్న బీమా నియంత్రణ సంస్థ భవనానికి ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో ఏటా నాలుగు లక్షల పక్కా గృహాలు నిర్మించే లక్ష్యంతో ప్రకటించిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఎల్‌బి స్టేడియంలో జరుగుతుంది. మంగళవారం సాయంత్రం అయిదుగంటలకు ప్రధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతారు.












Click it and Unblock the Notifications
