న్యూఢిల్లీ: మరోసారి దేశ విభజనను అనుమతించేది లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు కాశ్మీర్‌ను తమకుఅప్పగించాలనే పాకిస్థాన్ డిమాండ్‌ను అంగీకరించబోమని ఆయన అన్నారు.
అమెరికాలోసెప్టెంబర్ 11వ తేదీ టెర్రరిస్టు దాడులు అఎn్ఘానిస్థాన్‌లో అంతర్జాతీయ జోక్యానికి దారి తీయడం వల్ల భారత్‌పై పడే ప్రభావంపై జరిగిన చర్చకు ఆయన మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. సార్క్ సదస్సు సందర్భంగా తాను ఖాడ్మండు వెళ్తే, ముషారఫ్ వస్తే ఇద్దరం లాంఛనంగా కలుసుకునే అవకాశం వున్నదని వాజ్‌పేయి చెప్పారు.
కాశ్మీర్‌ను పొందితే భారత్‌తో సంబంధాలు మెరుగవుతాయనే భ్రమలో పాకిస్థాన్ వున్నదని, దీన్ని ఎప్పుడు కూడా అనుమతించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
