న్యూఢిల్లీః రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో బుధవారం నాడు మరోసారి తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. జార్జ్ ను రక్షణ మంత్రిగా గుర్తించడానికి తాము నిరాకరిస్తున్నామంటూ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల చేసిన ప్రకటనపై రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.
బుధవారం నాడు రాజ్యసభ సమావేశమైన తర్వాత రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను ఉద్దేశించిన ప్రశ్నను సభాపతి కృష్ణకాంత్ చదివి వినిపించారు. ఈ ప్రశ్నకు జార్జ్ సమాధానం చెప్పాల్సివుండగా, జార్జ్‌ను తాము రక్షణ మంత్రిగా గుర్తించడం లేదని జార్జ్‌ను తాము ప్రశ్నలు అడగమని ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. తహల్కా కుంభకోణం నుంచి బయటపడకుండానే జార్జ్ మళ్లీ రక్షణ మంత్రి పదవి చేపట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. ఈ దశలో కృష్ణకాంత్ జోక్యం చేసుకుని రాజ్యాంగబద్దంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని ప్రధాని వాజ్‌పేయి ఈ నియామకం జరిపారని దానిని వ్యతిరేకించడం సరికాదని వివరించడానికి ప్రయత్నించినా సభ్యులు వినలేదు. ఈ దశలో సభాపతి ప్రశ్ను ఉపసంహరిస్తున్నట్టుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications
