హైదరాబాద్: తెలంగాణపై, పులిచింతల ప్రాజెక్టుపై హద్దుమీరే పార్టీ నాయకులపై క్రమ శిక్షణా చర్య తీసుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) హెచ్చరించింది. బుధవారంనాడిక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)ల అధ్యక్షుల సమావేశంలో పిసిసి ఈ హెచ్చరిక చేసింది. ఈ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) పరిశీలకుడు దల్జీత్ సింగ్‌తో పాటు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు పాల్గొన్నారు. సమావేశంవివరాలను పార్టీ నాయకుడు గాదె వెంకటరెడ్డివిలేకరులకు తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరమ్‌ను పార్టీ అదిష్ఠానం గుర్తించలేదని దల్జీత్ సింగ్ చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని గాదె వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిషన్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సిడబ్ల్యుసి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై చర్య తీసుకుంటామని వెంకటరెడ్డి చెప్పారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుపై పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని,అందువల్ల ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌వారు నోరు మెదపకూడదని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి)నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకటనను నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యతిరేకించారు. దానికి తోడు, పులిచింతల ప్రాజెక్టును నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ వ్యతిరేకిస్తున్నారు.
డిసిసిల కార్యవర్గాలను డిసెంబర్ 15వ తేదీలోగా ఖరారు చేసి అధిష్టానం ఆమోదం కోసం పంపాలని బుధవారంనాటి డిసిసి అధ్యక్షుల సమావేశం నిర్ణయించింది. ధాన్యానికి మద్దతు, పనికి ఆహార పథకం, స్థానిక సంస్థలకు అధికారాలు వంటిఅంశాలపై చంద్రబాబు ప్రభుత్వ విధానాలను సమావేశం తీవ్రంగావిమర్శించింది. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేపట్టాలని కూడా నిర్ణయించింది.
పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు తెలంగాణ నాయకులను కించే పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరమ్ కన్వీనర్ ఎ. ఇంద్రకరణ్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి నాయకుడిగా
ఎదిగిన సత్యనారాయణరావు ఆ విధంగా మాట్లాడడం ఉచితం కాదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సత్యనారాయణరావుకు ఒక లేఖ రాశారు.

Click it and Unblock the Notifications