నెల్లూరు: మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై మరో తెలుగుదేశం శాసనసభ్యుడు బహిరంగవిమర్శలకు దిగారు. మంత్రి వర్గంలో నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానం కల్పించడంపై కొవ్వూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బుధవారంనాడు ధ్వజమెత్తారు.
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో పరాయివారి మాట చెల్లుబాటుఅయిందని, వైస్రాయ్ హోటల్ ప్రభాకర్ రెడ్డి, ఐజి శివశంకర్ చెప్పిన వారికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇచ్చారని ఆయనవిమర్శించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవద్దని జిల్లాలోని ఐదుగురు శాసనసభ్యులు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి పెడచెవినపెట్టారని ఆయన అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సహకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయానికి కట్టుబడి వుంటానని, పార్టీని వదిలిపెట్టబోనని ఆయన చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబునాయుడని, తాను చంద్రబాబునాయుడికి, పార్టీకిఅందుబాటులో వుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
