తాలిబన్ల ఆస్తుల స్తంభన
న్యూయార్క్‌ః అఎn్గానిస్తాన్‌ను ఏలిన తాలిబన్ ప్రభుత్వంలోని ప్రతి సభ్యుని ఆస్తులను స్తంభింపజేస్తూ ఐక్యరాజ్యసమితి ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ ప్రభుత్వం హయాంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ఖాతాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఢిల్లీలోని సిటీబ్యాంక్‌లో ఒక తాలిబన్లకు సంబంధించిన ఒక ఖాతా వుంది.
తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మొదలుకుని తాలిబన్ ప్రభుత్వంతో సన్నిహితంగా వున్న సీనియర్ అధికారుల వరకు మొత్తం 152 మంది పేర్లతో ఐక్యరాజ్యసమితి ఒక జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలోని వారి ఆస్తులనే స్తంభింప జేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమితి సభ్యదేశాలన్నీ ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సివుంటుంది. అమెరికా దాడులతో అధికారం పోగొట్టుకుని స్వదేశంలోనే దయనీయ స్థితిలో వున్న తాలిబన్లకు ఇది మరో తీవ్రమైన దెబ్బగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications
