హైదరాబాద్: మంత్రి వర్గవిస్తరణపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన శాసనసభ్యులపై తెలుగుదేశం నాయకత్వం కన్నెర్ర జేసింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తిన అనకాపల్లి శాసనసభ్యుడు దాడి వీరభద్రరావుకు తెలుగుదేశం నాయకత్వం బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మంత్రి వర్గవిస్తరణపై అసంతృప్తితో బహిరంగ వ్యాఖ్యలు చేసేవారిని సహించబోమని, బహిరంగ వ్యాఖ్యలు చేసేవారందరిపై చర్య తీసుకుంటామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లాల్‌జాన్ బాష విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై నాయకత్వంతో శాసనసభ్యులు తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చునని, ఆ అవకాశం ఉన్నప్పుడు బహిరంగ వ్యాఖ్యలకు దిగడం సరి కాదని ఆయన అన్నారు. దాడి వీరభద్రరావు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు ముందు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడితో మాట్లాడారని, పునర్వ్యస్థీకరణ అనంతరం కూడా అలా మాట్లాడే అవకాశం వుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
