న్యూఢిల్లీ: అమెరికా నావికాదళం హెలికాప్టర్ కాల్పక్కం అణువిద్యుత్కేంద్రంపై చక్కర్లు కొట్టిన సంఘటన బుధవారం లోక్‌సభను కుదిపేసింది. అమెరికాతో భారత ప్రభుత్వంకుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగంగానే అమెరికా హెలికాప్టర్ కాల్పక్కం అణువిద్యుత్కేంద్రంపై విహరించిందని ప్రతిపక్షాలువిమర్శించాయి. ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వంపెదవి విప్పకపోవడంతో అన్నాడియంకె మినహా ప్రతిపక్షాలన్ని సభ నుంచి వాకౌట్ చేశాయి.
అంతకుముందు జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అమెరికా నావికాదళం హెలికాప్టర్ కాల్పక్కం అణువిద్యుత్కేంద్రంపై సంచరించిందని విమర్శించారు. ఆయనకు ప్రతిపక్షాల సభ్యులందరూ సమర్థించారు. ఈవిషయమై 45 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడానికిసీనియర్ మంత్రులెవరూ సభలో లేరు. దీంతో ప్రధాని వాజ్‌పేయి సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. దీంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.












Click it and Unblock the Notifications
