కాబూల్‌ః కాందహార్‌లో దాక్కుని వున్నట్టుగా అనుమానిస్తున్న లాడెన్, ముల్లా ఒమర్‌ల కోసం అమెరికన్ బలగాలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నాయి. కాందహార్‌ను పూర్తిగా తమ స్వాధీనం చేసుకునేందుకు అమెరికన్ కమెండోలు దాడులను తీవ్రం చేశారు. కొత్తగా మరికొన్ని వేల మంది సైనికులను కూడా రంగంలోకి దించారు.
భూతల పోరులో తమ సైనికులు వేల సంఖ్యలో మొహరించి వున్నప్పటికీ మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అమెరికన్ యుద్ధ విమానాలు కాందహార్‌పై భీకరంగా బాంబుదాడులు జరిపాయి. అల్‌ఖైదా, తాలిబన్ సంస్థలకు చెందిన అగ్రనేతలు తలదాచుకున్న ఇంటిపై తమ విమానాలు బాంబులను గుప్పించినట్టుగా అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో తాలిబన్, అల్‌ఖైదా అగ్రనేతలు హతమై వుండవచ్చన్న అభిప్రాయం అమెరికా వ్యక్తం చేసింది.
అయితే ఈ దాడిలో ఎంతమంది మరణించారు, మరణించినవారిలో తాలిబన్, అల్‌ఖైదా అగ్రనేతలు ఎవరున్నారు అనే విషయాలు మాత్రం అమెరికా బయటపెట్టడం లేదు. అయితే పాకిస్తాన్‌లో తాలిబన్ ప్రతినిధి జయీఫ్ మాత్రం అమెరికా ప్రకటనను ఖండించారు. ముల్లా ఒమర్, లాడెన్ సురక్షితంగా వున్నారని ప్రకటించారు. అమెరికా జరపిన బాంబు దాడిలో తాలిబన్ కార్యాలయం ఒకటి
ధ్వంసమైన మాట నిజమే అయినప్పటికీ అందులో ఒమర్ లేరని జయీఫ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
