న్యూఢిల్లీః ప్రైవేట్ రంగంలో గోడౌన్ల నిర్మాణాన్ని ప్రొత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు లోక్‌సభలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్ధ్యాన్ని హెచ్చించే ప్రతిపాదన వున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి కొంత కాలం పడుతుందని ఆయన అన్నారు.
ఈ లోపున ఔత్సాహికులు ముందుకు వస్తే గోడౌన్ల నిర్మాణానికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రైవేట్ గోడౌన్ల నిర్మాణానికి బాంకులు రుణాలు ఇవ్వడం లేదనే ఆరోపణలను ఆయన కొట్టివేశారు. ప్రైవేట్ గోడౌన్లకు ప్రభుత్వం ఏడేళ్ల గ్యారంటీ కూడా ఇస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
