హోమ్‌ పేజి

హైదరాబాద్‌ఃప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంవ్యతిరేకం కాదని పిసిసి నేత ఎమ్‌సత్యనారాయణరావు స్పష్టం చేశారు.తెలంగాణాకు చెందిన కాంగ్రెస్‌ నేతలుచేస్తున్న విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించడంవల్లనే తమ పార్టీ నాయకత్వం రాష్ట్రాలపునర్విభజనపై కొత్త కమిషన్‌ వేయాలనికేంద్రప్రభుత్వాన్ని కోరినట్టుగా ఎమ్‌ఎస్‌చెప్పారు. ప్రత్యేక తెలంగాణా పాటపాడితే బహిష్కరణవేటువేస్తామని పార్టీ కార్యకర్తలను, నాయకులనుతాము హెచ్చరించినట్టుగా వచ్చినఆరోపణలను ఆయన ఖండించారు.

పార్టీక్రమశిక్షణను ఉల్లంఘించరాదని మాత్రమేతాము కోరాము తప్ప, ప్రత్యేక తెలంగాణ అడగవద్దనిచెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా కరీంనగర్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్‌నేతల సమావేశంలో కూడా పార్టీ జాతీయకార్యదర్శి దల్జీత్‌సింగ్‌, ప్రత్యేకతెలంగాణాకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం అనుకూలంగావున్నదని ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకత్వంప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకమనేఆరోపణను ఆయన ఖండించారు. కాగా కాంగ్రెస్‌నేతల్లో హఠాత్తుగా కనిపిస్తున్న మార్పుకార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నది. నిన్నమొన్నటివరకుప్రత్యేక తెలంగాణా ఊసెత్తితే ఖబడ్దార్‌ అనిబెదిరించిన నేతలు ఇప్పుడు ప్లేటుఫిరాయించడం వారికి ఆశ్చర్యం కలిగిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+