ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ లోపీపుల్స్ వార్ విధ్వంసం సృష్టించింది. బుధవారం వేకువజామున సిర్పూర్ మండల రెవిన్యూ కార్యాలయాన్నిపీపుల్స్ వార్ నక్సలైట్లు పేల్చి వేశారు. శక్తివంతమైనడెటొనేటర్లు అమర్చి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో కనీసం పది లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాధమికఅంచనాలను బట్టి తెలుస్తున్నది.
ఆస్తి నష్టం తో పాటు కీలకమైన రికార్డులు కూడా నక్సలైట్ల విధ్వంసకాండలో ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగాపీపుల్స్ వార్ గ్రూప్ గత కొద్ది రోజులుగా విజృంభించినవిషయం విదితమే. తెలంగాణా జిల్లాలను వదిలిపెట్టి రాయలసీమ, కోస్తా జిల్లాల్లోపీపుల్స్ వార్ ఈ సారి విధ్వంసం సృష్టించడం విశేషం.












Click it and Unblock the Notifications