గాంధీభవనం ఓ రణక్షేత్రం
హైదరాబాద్‌ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీపై కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న అసమ్మతి ఇంకా ఆరలేదు. వరుసగా నాలుగో రోజు బుధవారం నాడు కూడా టిక్కెట్లు రాని అభ్యర్థులు గాంధీభవన్ వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టారు. తమను బుజ్జగించేందుకు వచ్చిన నేతలను వారు ఘెరావ్ చేశారు. నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.ప్రభాకర్ పార్టీ అధిష్ఠానంపై అలిగి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మేయర్ అభ్యర్థి దానం నాగేందర్ తో ఏకంగా వారు యుద్ధానికి దిగారు.












Click it and Unblock the Notifications
