వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బుష్ హామీ - అద్వానీ హ్యాపీ
వాషింగ్టన్‌ః పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తీవ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకుంటారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బుష్ భారత హాంశాఖ మంత్రి అద్వానీకి హామీ ఇచ్చారు. అమెరికా సెక్యూరిటీ అడ్వయిజర్ రైస్ తో అద్వానీ గురువారం వైట్ హౌస్ లో చర్చలు జరుపుతుండగా బుష్ స్వయంగా వచ్చి ఆయనను కలుసుకున్నారు. ముషారఫ్ గురించి అమెరికా ఏం అనుకుంటున్నదీ బుష్ అద్వానీకి వివరించారు. బుష్ హామీ తనకు సంతృప్తినిచ్చిందని ఆ తరువాత విలేకరుల సమావేశంలో అద్వానీ చెప్పారు.
Comments
Story first published: Friday, January 11, 2002, 23:53 [IST]