భారత్ ను కాదని.. డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

Trump China visit: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారట్లేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా వైమానిక దళం తరచూ దాడులకు దిగుతోంది. ఇరాన్ పెట్టిన ప్రతిపాదనలను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చిన నేపథ్యంలో.. శాంతి చర్చల్లో విఘాతం ఏర్పడినట్టయింది. ఇరాన్ పెట్టిన ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఆమోదయోగ్యంగా లేదని తేల్చి చెప్పారు ట్రంప్. దీంతో అక్కడి పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చినట్టయింది.

ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్.. చైనాలో పర్యటించబోతోన్నారు. ఆ దేశాధ్యక్షుడు గ్ఝీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు బీజింగ్ లో అడుగు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం అధికారికంగా ప్రకటించారు. జిన్ పింగ్ తో నిర్వహించబోయే చర్చల అజెండా సైతం ఖరారైంది.

Trump to Visit China May 13-15 for High-Stakes Talks with Xi Jinping Taiwan Policy Remains Unchanged

బీజింగ్‌లో అత్యున్నత స్థాయి ముఖాముఖి చర్చల్లో పాల్గొననున్నారు డొనాల్డ్ ట్రంప్- గ్ఝి జిన్ పింగ్. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల ఈ రెండు దేశాధినేతలు ముఖాముఖి భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారి మధ్య ఇరాన్ అంశం చర్చకు రానుంది. అలాగే అమెరికా- చైనా మధ్య వాణిజ్య సంబంధాలపై మాట్లాడతారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడం, సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ట్రేడ్ వార్ కు తెరదించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న టారిఫ్ విధానాలు, తైవాన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఖనిజాలు వంటి విస్తృత అంశాలు కూడా చర్చకు రావొచ్చు. రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ట్రంప్ చైనాను సందర్శించబోతోండటం ఇదే మొదటిసారి. నిజానికి మార్చిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉన్నప్పటికీ.. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో వాయిదా పడింది. ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉందని అమెరికా చీఫ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ తెలిపారు.

గురువారం ఉదయం గ్ఝి జిన్‌పింగ్‌ను కలుస్తారు డొనాల్డ్ ట్రంప్. మధ్యాహ్నం టెంపుల్ ఆఫ్ హెవెన్ ను సందర్శిస్తారు. సాయంత్రం ఆయనకు విందు ఇస్తుంది చైనా. శుక్రవారం ఇద్దరు నాయకులు టీ సమావేశానికి హాజరవుతారు. అనంతరం ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్తారు ట్రంప్. జిన్‌పింగ్ ఈ ఏడాది చివర్లో అమెరికాను సందర్శించే అవకాశం ఉందని అన్నా కెల్లీ పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఆసియా పర్యటన సమయంలో ట్రంప్ భారత్ వస్తారని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చైనా పర్యటనకు వెళ్లబోతోండటం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+