తప్పు మీది- వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికా ? మోడీపై రాహుల్ ఫైర్..!

గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఇంటి నుంచే పని చేయాలని, విదేశీ ప్రయాణాలకు, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోడీ (PM Modi) ఇచ్చిన పిలుపుపై విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా మండిపడ్డారు. మోడీ ఇచ్చిన "దేశమే ప్రథమం, సౌకర్యం కన్నా కర్తవ్యమే ముఖ్యం" అనే సందేశంపై స్పందిస్తూ.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య మోదీ రాజీపడ్డారని రాహుల్ స్పష్టంచేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రజలను త్యాగాలు చేయమని కోరుతున్నారని ఆక్షేపించారు.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపు ఖరారు..! లీటరు ఎంతంటే, గ్యాస్ ఇలా..!
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపు ఖరారు..! లీటరు ఎంతంటే, గ్యాస్ ఇలా..!

"నిన్న మోదీజీ ప్రజలను త్యాగాలు చేయమని కోరారు -- బంగారం కొనవద్దు, విదేశాలకు ప్రయాణించవద్దు, పెట్రోల్ తక్కువగా వాడండి, ఎరువులు మరియు వంట నూనె వాడకాన్ని తగ్గించండి, మెట్రోను ఉపయోగించండి, ఇంటి నుంచే పని చేయండి. ఇవి సలహాలు కావు -- ఇవి వైఫల్యానికి నిదర్శనం," అని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు, దేశ ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి మోదీ ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Rahul Gandhi slams Modi s Work-From-Home Appeal a Sign of Failure
విజయ్ కు రాహుల్ ఫోన్ కాల్..! ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు?
విజయ్ కు రాహుల్ ఫోన్ కాల్..! ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు?

మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వెంటనే, అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై మూడు నెలలు గడిచినా భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రపంచ సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండా, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ప్రధానమంత్రి "సిగ్గుమాలిన, నిర్లక్ష్యపూరితమైన, పూర్తిగా అనైతికమైన" చర్య అని కాంగ్రెస్ ఆగ్రంహ వ్యక్తం చేసింది. ప్రధానికి ఎన్నికలు, నీచ రాజకీయాలే ఏకైక ప్రాధాన్యతగా ఉన్నప్పుడు, దాని అంతిమ ఫలితం రాబోయే ఆర్థిక విపత్తే అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+