రిక్షాలో తప్పించుకున్న ముల్లా ఉమర్‌

కాబూల్‌ః తాలిబన్ల నేత ముల్లా ఉమర్‌ అమెరికా దాడుల నుంచి అత్యంత నాటకీయంగా తప్పించుకు పారిపోయినట్టు తెలుస్తున్నది. అఎn్గాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న సమయంలో ముల్లా ఉమర్‌ దాగిన భవనం కూడా దాడులకు గురైంది.

అమెరికా ముమ్మరంగా కురిపిస్తున్న బాంబుల తాకిడికి తామున్న భవనం దానితో పాటు తాము సర్వనాశనం కావడం తథ్యమని గ్రహించిన ముల్లా ఉమర్‌ సహచరులు ఆయన్ను తప్పించుకోవల్సిందిగా ఆయన్ను కోరారు. అయితే ఆయన మాత్రం స్వయంగా జార్జ్‌బుష్‌ వచ్చిన తాను ఇక్కడినుంచి కదిలేది లేదని భిష్మించుక్కూచున్నారు. ఎంతో ప్రాదేయపడితే గానీ ఆయన అంగీకరించలేదు. అయితే ఆయన సొంతకారులో తప్పించుకుంటే గగనతలంలోని అమెరికా విమానాలు గుర్తించే అవకాశం వున్నదని భావించిన ఆయన సహచరులు ఆయన్ను ఒక సైకిల్‌ రిక్షాలో తప్పించారు. రిక్షాలో పట్టణం మధ్య ప్రాంతానికి చేరుకుని అక్కడినుంచి మట్టితో కప్పిన ఒక ట్రక్కులో ఆయన పారిపోయారు. ఈ విషయాలు ముల్లా ఉమర్‌ సన్నిహిత సహచరున్ని ఉటంకిస్తూ పాకిస్తాన్‌ పత్రిక ప్రకటించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+