ఇస్లామాబాద్‌ః ఇస్లామాబాద్ లోని 16 అంతస్తుల ప్రభుత్వా కార్యాలయంలో మంగళవారం ఆర్థరాత్రి దాటిన తరువాత పెను అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 16 అంతస్తుల్లో పై భాగాన వున్న 8 అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి వుంటుందని అధికారులు భావిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు గంటల తరబడి కుస్తీపట్టాల్సి వచ్చింది. డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి తెల్లవారుజాము సమయానికి మంటలను అదుపులోకి తీసుకురాగలిగాయని అధికారులు వివరించారు.