హైదరాబాద్‌ః కొత్తూరు సంఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ఎస్‌ఐ ఎంఎ జావేద్, షాద్‌నగర్ ఎస్‌ఐ ముత్తయ్యలను సస్పెండ్ చేస్తున్నట్టుగా హోం మంత్రి దేవేందర్ గౌడ్ ప్రకటించారు.
పారిశ్రామిక వేత్తలైన పవన్‌గార్గ్,అశోక్ గోయల్ అనే వ్యక్తులను పోలీసు స్టేషన్ నిర్మాణానికి ఉచితంగాస్టీల్ ఇవ్వాలని డిమాండ్ చేసిన పోలీసులు వారు నిరాకరించినందుకు నడిరోడ్డులో బట్టలువిప్పి కొట్టినట్టుగా ఆరోపణలు వచ్చినవిషయం విదితమే. ఈ వ్యవహారంపై సీనియర్ పోలీసు అధికారి కుమావత్‌విచారణ జరిపి ఇచ్చిన ప్రాధమిక నివేదిక ఆధారంగా ఇద్దరు ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.