ఏలూరుః ఎయిడ్స్ సోకిన భయానికి తోడు వైద్యానికి తగిన ఆర్ధిక స్తోమత లేకపోవడంతో ఒక నిండు కుటుంబం ఆత్మాహుతికి పాల్పడింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారపు పేటలో జరిగింది.
వృత్తిరీత్యా ఫోటో గ్రాఫరైన నారం శ్రీనివాసరావు అనే 28 ఏళ్ల యువకునికి ఎయిడ్స్ సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలడంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. మందుల కోసం డబ్బులకు ఇబ్బంది వుండటంతో పాటు తన కుమార్తె నాలుగు సంవత్సరాల సాయి దుర్గకు కూడా హెచ్‌ఐవి పాజిటివ్ అని తేలడంతో తమ కుటుంబానికిఅంతా ఎయిడ్స్ సోకిందనే భయంతో శ్రీనివాసరావు ఆయన భార్యవిజయకుమారి, పిల్లలు సాయిదుర్గా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు సాయిమణికంఠతో పాటు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు.