మహబూబ్‌నగర్‌ ఎస్పీ బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా రెండు జిల్లాల ఎస్‌పిలను మార్చేసింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎస్‌పిలను బదిలీ చేసి కొత్తవారిని ఆ స్థానాల్లో వేసింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో జరిగిన సంఘటనలో కింది స్థాయి పోలీసులను వెనుకేసుకొచ్చారని భావించి ఆ జిల్లా ఎస్‌పి ఎన్‌. బాలసుబ్రహ్మణ్యంను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆదిలాబాద్‌ జిల్లాలో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఉన్నఆర్‌.కె. మీనాను నియమించింది. కొత్తూరు సంఘటనపైవివాదం ఒక వైపు రాజుకుంటుండగానే మైసిగండిలో పోలీసులు ఒక వ్యాపారిని హత్య చేసిన సంఘటన ప్రభావం కూడా ఎస్‌పిపై పడింది. బాలసుబ్రహ్మణ్యంను గుంతకల్లురైల్వే ఎస్‌పిగా నియమించింది.

ఖమ్మం ఎస్‌పి రాజరత్నంనాయుడును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కడపలో బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్నవి.వి. శ్రీనివాసరావును నియమించింది. రాజరత్నం నాయుడుకు ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు.ఈ బదిలీల నేపథ్యంలో కొత్త డిజిపి నియామకాన్ని ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+