తిరుమల వెళ్తున్నారా - దర్శనం, వసతి పై టీటీడీ కీలక అప్డేట్.. ఈ తేదీల్లో ఇలా పొందండి..!!

తిరుమలలో పండుగ వాతావరణం నెలకొంది. సాలికట్ల బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అన్ని ప్రాంతాలను సుందరంగా తీర్చి దిద్దారు. వినాయక చవితి.. వరుస సెలవుల వేళ శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. కాగా... డిసెంబర్ నెలలో తిరుమలకు వచ్చే వారి కోసం టీటీడీ కీలక సూచన లు చేసింది. దర్శనం.. వసతి బుకింగ్ కోసం తేదీలను ప్రకటించింది.

డిసెంబర్ నెల దర్శన, సేవలతో పాటుగా వసతి కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపా అలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌ను న్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమల శ్రీవారికి నిత్యం 45 ప్రసాదాల నివేదన : ఏ సమయంలో ఏది, ప్రత్యేకతలు..!!
తిరుమల శ్రీవారికి నిత్యం 45 ప్రసాదాల నివేదన : ఏ సమయంలో ఏది, ప్రత్యేకతలు..!!
ttd-will-release-the-darshan-and-accommodation-quotas-online-for-the-month-of-devember-dates-is-here

దర్శనం.. వసతి ఇలా పొందండి

అదే విధంగా అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని భక్తులకు టీటీడీ సూచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+