ఆంధ్రరాష్ట్రానికి ఐఐటి కావాలి
హైదరాబాద్‌ః బాసరలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ అంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానించింది. చెన్నైలోమినహా దక్షిణాదిలో మరెక్కడా ఐఐటి లేని కారణంగా ఉన్నతవిద్యను అభ్యసించాలనుకొనే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తున్నదనిఅసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైదరాబాద్ లో ఎన్నో అంతర్జాతీయవిద్యాసంస్థలు ప్రారంభించనప్పటికీ ఆవి సంపన్నవర్గాలకే పరిమితం అవుతున్నాయని సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు.
ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానాన్నిఅసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సాధ్యమైనంత త్వరలో బాసరలో ఐఐటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా ఆతీర్మానంలో కేంద్రాన్నికోరారు.












Click it and Unblock the Notifications
