రైల్వే లైన్‌ను పేల్చేసిన తీవ్రవాదులు
పాట్నా: మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) తీవ్రవాదులు బుధవారం తెల్లవారు జామున జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఒక రైల్వే లైన్‌ను పేల్చివేశారు. దీంతో ఒక రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రకంగా తీవ్రవాదులు తలపెట్టిన బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల 24 గంటల బంద్ హింసాత్మక చర్యలతో మొదలైంది.
ఇదిలా వుండగా, తీవ్రవాద నిరోధక ఆర్డినెన్స్ (పొటో)కు వ్యతిరేకంగా తీవ్రవాదులు తలపెట్టిన బంద్‌కు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. గస్తీని ముమ్మరం చేశారు.
పొటో కింద ఇటీవలే నిషేధానికి గురైన పీపుల్స్‌వార్ ఈ బంద్‌కు తన మద్దతు ప్రకటించింది. ఎంసిసి బంద్ బీహార్‌కు మాత్రమే పరిమితమైనట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
