వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడారంజాతరకు ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు జరిగిన చర్చకు బుధవారం నాడు ఆయన సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు.

రెండున్నర గంటలపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. విద్యుత్‌ చార్జీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తూర్పారబట్టారు. రెగ్యులేటరీ కమిషన్‌ సిఫారసుల మేరకు సహేతుకమైన పద్దతిలో చార్జీల పెంపు వుంటుందని ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఎంత మేర సబ్సిడీ ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఎన్ని అప్పులు తెస్తున్నా వాటిని రాష్ట్ర అభివృద్ధికే వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. 2002 ప్రపంచ చదరంగం పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. వెనకబడినప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టులను చేపట్టనున్నట్టుగా ఆయన చెప్పారు. సంక్షేమానికి తాము సంస్కరణలోత సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. అనంత రైతులను ఆదుకునే పేరుతో నవ్వుతూ భిక్షాటన చేపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు రైతులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను వంచించడం మినహా కాంగ్రెస్‌కు వేరే లక్ష్యం లేదని ఆయన దుయ్యబట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X