న్యూఢిల్లీ: దేశంలో కార్మిక సంస్కరణలను చేపట్టే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం పారిశ్రామికవివాదాల చట్టానికి సవరణలు తెచ్చే ప్రతిపాదనలను ఆమోదించింది.
ఆ సవరణలను వచ్చే పార్లమెంటుబడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార ప్రతినిధి చెప్పారు. సవరణల వల్ల ప్రభుత్వ అనుమతి లేకుండానే వేయి మంది వరకు ఉద్యోగులు ఉన్న ఖాయిలా పరిశ్రమలు కార్మికులను తొలిగించడానికివీలు కలుగుతుంది. ఇంతకు ముందు వంద మంది ఉద్యోగులున్నప్పుడు మాత్రమే ఈ విధంగా తొలగించడానికివీలు వుండేది. గతబడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా చేసిన ప్రకటనలో భాగంగా ఈ సవరణలను ప్రభుత్వం తెస్తోంది. 99 శాతం ఖాయిలా పడిన పరిశ్రమలను ప్రభుత్వ అనుమతి లేకుండా మూసేయడానికి ఈ సవరణల వల్ల వీలవుతుంది.