హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టిన 2002-2003 బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని సిపిఎం దుయ్యబట్టింది. ప్రభుత్వం పూర్తి బాధ్యతారహితంగా బడ్జెట్‌ను రూపొందించిందని సిపిఎం నేత రాఘవులు దుయ్యబట్టారు.
నక్సలైట్ల సమస్యను సామాజిక, ఆర్ధిక సమస్యగా చెప్పే ప్రభుత్వ రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ప్రజాజీవితాన్ని కల్లోలం చేస్తున్న ఈ సమస్య పరిష్కారానికిబడ్జెట్‌లో ఒక్క చర్యనైనా ప్రతిపాదించలేదని ఆయనవిమర్శించారు. బడ్జెట్ నిండా అంకెల మాయ తప్ప మరేమీ లేదని ఆయన ఆరోపించారు.