రైల్వే బడ్జెట్‌పై కేబినెట్‌ భేటీ

న్యూఢిల్లీః రైల్వే మంత్రి నితిష్‌ కుమార్‌ ఈ నెల 26న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన శుక్రవారం నాడు సమావేశమైంది. బడ్జెట్‌ ప్రతిపాదనలు కఠినంగానే వుండే అవకాశం వున్నదని రైల్వే మంత్రి ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై పెద్దఎత్తున ఊహగానాలు వినవస్తున్నాయి.

సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికుల చార్జీలనుపెంచే అవకాశం వున్నదని, రవాణా చార్జీలు పెంచే అవకాశం వున్నదనిఅంటున్నారు. రైల్వే శాఖలో చాలా కాలంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నపెను సంస్కరణలకు కూడా ఈ బడ్జెట్‌తో శ్రీకారం చుట్టే అవకాశం వుంది. ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత రాకుండా వడ్డనలు సుతిమెత్తంగా వుండే విధంగా మంత్రివర్గంబడ్జెట్‌ ప్రతిపాదనలకు అవసరమైన సవరణలు చేసే అవకాశం వున్నదనిఅంటున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+