హైదరాబాద్‌ః ప్రభుత్వ చౌక దుకాణాలను ఎత్తివేసి వాటి స్థానంలో ఏర్పాటు చేయతలపెట్టిన సర్వప్రియ స్టోర్స్ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయి. ఈ దుకాణాల్లో పద్దెనిమిది రకాల నిత్యావసర సరుకులు చౌక ధరలకు విక్రయిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా వున్న 40 వేల మంది ప్రభుత్వ డీలర్లు ఈసర్వప్రియ దుకాణాలను ప్రారంభిస్తారని శుక్రవారం నాడు జరిగిన జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.సర్వప్రియ స్కీమ్ ప్రారంభంతో పాటు రబీ సీజన్‌లో మద్దతు ధరకు ధాన్యంసేకరణకు తీసుకోవల్సిన చర్యలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.