న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అధికారంలో వుండాలనుకుంటే అయోధ్యలో తానుస్వాధీనం చేసుకున్న భూమిని రామ జన్మభూమి ట్రస్టుకుఅప్పగించాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) శుక్రవారం అన్నది.
అయోధ్య వివాదంపై ప్రభుత్వం మార్చి 15వ తేదీ లోగా నిర్ణయం తీసుకోకపోతే సత్యాగ్రహం ప్రారంభిస్తామని మత నాయకులు ఇప్పటికే ప్రకటించారని విహెచ్‌పి వర్కింగ్ ప్రసిడెంట్‌అశోక్ సింఘాల్ ఆజ్‌తక్‌తో చెప్పారు. మత నాయకులను అణచివేసిన ప్రభుత్వాలేవీ దేశంలో మనుగడ సాగించలేదని, ములాయం సింగ్ జాతకాన్ని చూశామని, ములాయం సింగ్ లాగా హిందూ మత నాయకులను అణచివేసిన నాయకులను ఎవరినైనా చూశామని ఆయన అన్నారు.