ఆప్కోలో 11 కోట్లతోవిఆర్‌ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆప్కోలోస్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకం అమలు తప్పదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన శనివారంనాడిక్కడ ప్రారంభించారు. ఆప్కోలో 525 మందిమిగులు ఉద్యోగులు ఉన్నారని, వీరికి 11 కోట్ల రూపాయలతోవిఆర్‌ఎస్‌ను అమలు చేస్తామని ఆయన చెప్పారు.
ఆప్కో పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసినవిజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ధనంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆప్కోకు 40 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంఅందించే అంశాన్ని పరిశీలిస్తామని, రాష్ట్రంలో టెక్స్‌టయిల్ పార్క్ స్థాపనకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
