ఆజంజాహీ పునరుద్ధరణకు చర్యలు: బాబు

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని ఆజంజాహీమిల్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈవిషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని,అందుకే ఆస్తులను సంరక్షిస్తున్నామని ఆయన చెప్పారు. తొంబై కోట్ల రూపాయలతో నిర్మించిన రాయపట్నం- వరంగల్‌ జాతీయ రహదారిని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయనమాట్లాడారు.

ముఖ్యమంత్రి శనివారం వరంగల్లు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకతీయ తోరణాన్ని ప్రారంభించారు. హసన్‌పర్తిలో 4.50 కోట్ల రూపాయలతో తలపెట్టిన సమీకృత మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.అశోక్‌ నగర్‌లో 38 కోట్ల రూపాయలతో తలపెట్టిన ఫ్లోరైడ్‌ రహిత మంచినీటి పథకానికి కూడా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.

పర్యాటక కేంద్రంగా మేడారం

మేడారంను కోటిన్నర రూపాయల వ్యయంతో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్‌ పాఠశాలను కూడా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 1.97 కోట్ల రూపాయల వ్యయంతో 37 రోజుల రికార్డు సమయంలో నిర్మించిన జంపన్నవాడు వంతెనను ఆయన ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని నక్సల్స్‌ పది రోజులు ఆటంకపరిస్తే వారిని మహిళలు వారిని ఎదిరించి పూర్తి చేయడంలో తోడ్పడినందుకు ఆయన మహిళలను అభినందించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల మేడారంకే కాకుండా రెడ్డి గూడెం, కొత్తూరు, తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+