సామాజిక భద్రతకు నిబద్ధులమే: ప్రధాని
న్యూఢిల్లీ: కార్మికుల సామాజిక భద్రతకు ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఈ విషయంలో ఒక జాతీయ విధానంఎంతైనా అవసరమని ఆయన శనివారం అభిప్రాయపడ్డారు. పరిశ్రమల మూసివేతకు, కార్మికుల ఉద్వాసనకు సులభమైన పద్ధతులను మంత్రి వర్గం ఆమోదించిన మర్నాడే వాజ్‌పేయి ఈ ప్రకటన చేయడంవిశేషం.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇఎస్‌ఐ) స్కీమ్ స్వర్ణోత్సవాల సందర్భంగాసామాజిక భద్రతపై జాతీయ విధానం రూపకల్పన అనేఅంశంపై ఏర్పాటయిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
సామాజిక భద్రత అంటే ప్రభుత్వం నిధులు కేటాయించి, ప్రభుత్వం నిర్వహించే భద్రతా పథకాలు మాత్రమే కాదని, సామాజిక భద్రతను కల్పించే ప్రభుత్వేతర సంస్థలన పటిష్టం చేసి క్రియాశీలం చేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం నియంత్రణ పాత్రను, వెసులుబాటు కల్పించే పాత్రను మాత్రమే పోషించగలదని ఆయన అన్నారు. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వం పాక్షికంగా కార్యక్రమాలు తీసుకోగలదని, వాటిని ప్రయివేట్ కంపెనీలు, సామాజిక సంస్థలు నడుపుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
