ఎన్‌డిఎపై బాల్ థాకరే తిరుగుబాటు
ముంబాయి: కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన కార్మిక సంస్కరణలను వ్యతిరేకించేవిషయంలో వామపక్షాలతో చేతులు కలుపుతామని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షం శివసేన హెచ్చరించింది. కార్మిక చట్టాల సవరణను శివసనే అధినేత బాల్ థాకరే శనివారం ఇక్కడ వ్యతిరేకించారు.
కార్మిక చట్టాల సవరణలను వ్యతిరేకించే వామ పక్ష సంఘాలతో, రాజకీయ పార్టీలతో తాను చేతులు కలుపుతానని ఆయన చెప్పారు. నిరుద్యోగం తీవ్ర స్థాయిలో వున్న ప్రస్తుత తరుణంలో ఈ సవరణలు కార్మికుల పాలిట విధ్వంసపూరితమైనవని ఆయన అభివర్ణించారు. ఈవిషయలో ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
