వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులెత్తేసిన రాజ్‌నాథ్‌సింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నోః ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాద్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన పెద్దపార్టీగా అవిర్భవించింది. అయితే నేరుగా వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని సమకూర్చుకోవడానికి ఎస్‌పి నేతలు ఒకటి రెండు వారాల గడవు కోరే అవకాశం వుంది. ఆదివారం సాయంత్రం వరకు వెల్లడయిన ఫలితాల బట్టి బిజిపి కూటిమి ద్వితీయ స్థానంలో వుంది.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటమినిఅంగీకరిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గవర్నర్‌ శాస్త్రికి తమ రాజీనామా లేఖనుఅందజేశారు. 402 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో 401 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎస్‌పి దాని మిత్రపక్షాలకు 151సీట్లు లభించగా, బిజెపి కూటమి 107 స్థానాల్లో విజయం సాధించింది. బిఎస్‌పి 89 స్థానాలతో తృతీయ స్థానంలో వుంది. కాంగ్రెస్‌కు 28సీట్లు మాత్రమే లభించాయి. ఇతరులు మరో 26 స్థానాల్లో గెలుపొందారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్టుగా రాజ్‌నాథ్‌
ప్రకటించారు. పార్టీ అధిష్టాన వర్గం చెప్పిన ప్రకారం భవిష్యత్‌ పాత్రను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ వంటిపెద్ద రాష్ట్రంలో ఏడాది కాలంలో పరిస్థితిని మార్చడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటమిని ఒప్పుకున్నప్పటికీ 89 స్థానాలతో మూడో స్థానంలో వున్న బిఎస్‌పిని తమవైపు తిప్పుకుంటే అధికారాన్ని ఎస్‌పి పరం కాకుండా ఆపవచ్చనే అభిప్రాయం బిజెపి నేతల్లో వుంది.అందువల్ల బిఎస్‌పి నేతలతో వారు ముమ్మరంగా మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు ఏలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కోసం ఎస్‌పి నేతలు కూడా వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. వివిధ పార్టీల నేతలతో ఎస్‌పి అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మంతనాలు జరుపుతున్నారు. ఆఖరు క్షణం వరకు యుపి కొత్త సర్కారు గురించే ఏమీ చెప్పడానిక లేదని పరిశీలకులుఅంటున్నారు. బిజెపి అండతో మాయావతి గద్దెనెక్కినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని వారుఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X