న్యూఢిల్లీః నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన పరాజయం పాలయిన హేమాహేమీల వివరాలు ఈ విధంగా వున్నాయి.
కర్ణాటక లోని కనకపుర లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ భారీ మెజార్టీతోవిజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్, మాయావతి గెలుపొందారు. శివపాల్‌సింగ్, జగ్జీత్‌సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్‌విజయపతాక ఎగురవేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి దివంగత మాధవరావు సింధియా కుమారుడు జ్యోతరాదిత్య సింధియా రికార్డు స్థాయి మెజార్టీతోవిజయం సాధించారు. కాగా రాంపతి శాస్త్రి, నిత్యానందస్వామి, కోయిజామ్ పరాజయం పాలయ్యారు.