ప్రత్యూష కేసుమరో మలుపు
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్యేనని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ఎం.వి. కృష్ణారావు అంటున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో ఇందుకు తగిన ఆధారాలు లభించాయని ఆయన చెబుతున్నారు. ప్రత్యూష గ్యాంగ్‌రేప్‌నకు గురి కాలేదని ఆయన వెల్లడించారు. ఆమెసెక్స్‌లో పాల్గొనలేదని పరీక్షల్లో తేలిందని ఆయన చెప్పారు. ఆమె జననాంగంలో ఏ విధమైనవీర్యం లేదని తేలినట్లు ఆయన తెలిపారు.దీంతో ప్రత్యూష మృతి కేసు మరో మలుపుతిరిగింది.
ప్రత్యూష, ఆమె ప్రేమికుడు సిద్ధార్థ రెడ్డి ఒకే విధమైనవిషం మింగినట్లు తేలిందని ఆయన అన్నారు. ఈ ఇరువురి ఆహారా నాళాల్లోఒకే విధమైన విష పదార్థం ఉన్నట్లు పరీక్షల్లో తేలిందనిఆయన చెప్పారు. ఈ విషం నోవాక్రన్ పురుగుల మందేననితేలినట్లు చెప్పారు. కమిషనర్ ఈ విధంగా చెప్పినవిషయాన్ని ఒక తెలుగు టీవీ చానల్ ప్రసారం చేసింది.
దీనికి ముందు నగర కమిషనర్ కృష్ణారావు- ప్రత్యూషబాయ్ ఫ్రెండ్ ఇంకా కోమాలోనే వుండడంతో కేసు ముందుకు సాగడం లేదని అన్నారు. సిద్ధార్థ రెడ్డి స్పృహలోకి వచ్చిన తర్వాత అతడ్ని ప్రశ్నిస్తే చాలావిషయాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు.
తన కూతురు ప్రత్యూషది హత్యేనని ప్రత్యూష తల్లి సరోజనీదేవిఅంటున్నారు. తన కూతురు హత్యలో కేర్ ఆస్పత్రి వైద్యుల పాత్ర కూడా వున్నదని, సిద్ధార్థ రెడ్డి, ఆయనతల్లిదండ్రుల పాత్ర వున్నదని ఆమె చెబుతున్నారు. ఈవిషయాలు చెప్పినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమెవిమర్శిస్తున్నారు.
ప్రత్యూష హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యదర్శి ఎ.వి.యస్. డిమాండ్ చేశారు. దోషులను పట్టుకుని ఎంతటిపెద్దవారైనా శిక్ష పడేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
