రామాలయానికిముహూర్తం
న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి 15 నాడు ఆలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని,విగ్రహాలను తరలించేందుకు విశ్వహిందూ పరిషత్ ముహూర్తం నిర్ణయించింది.విశ్వహిందూ పరిషత్ ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటామని ప్రధాని వాజ్‌పేయి ప్రతిపక్షాలకు హామీ ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందు వి.హెచ్.పి. ముహూర్తాన్ని ప్రకటించడంవిశేషం. మార్చి 15 మధ్యాహ్నం 2.15 గంటలకు విగ్రహాలను, శిల్పాలను, నిర్మాణ సామగ్రిని తరలించడం ప్రారంభిస్తామనివిశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్ కిషోర్ బుధవారం కొత్తఢిల్లీలో ప్రకటించారు.
ఆలయ నిర్మాణానికి ఇప్పటికే వేలాది మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
