వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమ స్వస్తికి విహెచ్‌పి తిరస్కృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య ఉద్యమాన్నివిరమించాలని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చేసినవిజ్ఞప్తిని విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) త్రోసి పుచ్చింది. ఉద్యమాన్నివిరమించే అధికారం తమకు లేదని, ధర్మాచార్యుల ఆదేశాల మేరకు తాము ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

తమకు ఆలయ నిర్మాణాన్ని వాయిదా వేసే అధికారం లేదని, ఆ అధికారందర్మాచార్యులకు మాత్రమే వుందని, తాము మార్చి 15వ తేదీ మధ్యాహ్నం గం.2:45 నిమిషాలకు స్థూపాలను చెక్కడం ప్రారంభిస్తామని విహెచ్‌పిసీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్‌ కిశోర్‌ విలేకరులతో చెప్పారు.

ఏ హామీ ఇవ్వకుండా, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఇవ్వాలనే డిమాండ్‌ తిరస్కరించి ధర్మాచార్యులు తమ కార్యక్రమాన్ని ప్రకటించేలా చేసింది వాజ్‌పేయినే అని ఆయన అన్నారు. ప్రభుత్వం గానీ, వాజ్‌పేయి గానీవిజ్ఞప్తి చేయదల్చుకుంటే ధర్మాచార్యులకే చేయాలని ఆయన అన్నారు.

వాజ్‌పేయి విజ్ఞప్తిని శషబిషలు లేకుండా తిరస్కరిస్తున్నారా అనివిలేకరులు అడిగితే- తిరస్కరించడమా, తిరస్కరించకపోవడమా అనేది ప్రశ్న కాదని, ఇచ్చుపుచ్చుకునే ధోరణి వుండడం అవసరం అని ఆయన బదులిచ్చారు. అయోధ్యలో వేలాది మంది కరసేవకులు గుమికూడడం వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ చేసిన ప్రకటనను ప్రస్తావించగా- తమ వైపు నుంచి ఏ విధమైన హింస వుండదని ఆయన చెప్పారు.

అయోధ్యను ప్రభుత్వం కంటోన్మెంట్‌గా మార్చిందని, ప్రజలు వాహనాల్లో అక్కడ తిరిగే పరిస్థితి లేదని ఆయనవిమర్శించారు. రామాలయమనేది విశ్వాసానికి సంబంధించినవిషయమని, ఒక వర్గాన్ని సంతోషపెట్టడానికి పార్టీలన్నీ దాన్ని ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X