చేనేత కార్మికుల చావులు పట్టని ప్రభుత్వం
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది కనీసం 200 మంది చేనేత కార్మికులు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అయినా ప్రభుత్వం వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే చేనేత రంగం ఈ దుస్థితికి చేరుకున్నదని మంత్రి పడాల భూమన్న కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు ఇందుకు నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు రభస నెలకొన్నది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం తెలుగుదేశం ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా చేనేత కార్మికులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నదనివిమర్శించారు. చేనేత కార్మికలు సంక్షేమ కోసం పలు చర్యలు చేపట్టామంటూ మంత్రి పడాలభూమన్న సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదంటూ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
