వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణకు పెద్దపీట - తగ్గినపెట్రోల్‌ ధర

By Staff
|
Google Oneindia TeluguNews

బరోడాః రామసేవకులుప్రయాణిస్తున్న సబర్మతి రైలు బోగీలనుదగ్ధం చేసిన వ్యవహారం పెను విధ్వంసానికి దారితీస్తున్నది. ఈదారుణ సంఘటనకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తంబంద్‌ కు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం ప్రశాంతంగాప్రారంభమైన బంద్‌ హింసాత్మకంగా మారింది.గుజరాత్‌ అల్లర్లలో 20 మంది మరణించారు. ఇందులో చాలా మంది కత్తిపోట్లకుగురై మృత్యువాత పడ్డారు. దీంతో గుజరాత్‌లోని 13 ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. నరోడా ఏరియాలో దుండగులు గుడిసెకు నిప్పంటించడంతోఅందులోని మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పారు. అహ్మదాబాద్‌లోని వేర్వేరు కత్తిపోటు సంఘటనల్లో నలుగురు మరణించారు. సూరత్‌లోని సలబతరపరలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. బరోడాలో మూడు, ఆనంద్‌లో ఒక కత్తిపోటు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అహ్మదాబాద్‌, బరోడా, బారుచ్‌, పాలన్‌పూర్‌, హిమ్మత్‌నగర్‌, లునవాడ, దీస, రాజ్‌కోట్‌, బిల్ది, పటాన్‌, ఖేడా, విష్‌నగర్‌, గోధ్రాలలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.

గాంధీనగర్‌లో ముస్లిం వక్ఫ్‌ బోర్డు కార్యాలయాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అల్లర్లు, రాళ్లువిసురుకోవడం, కత్తిపోట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.

రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సిఐఎస్‌ఎఫ్‌ కంపెనీల బలగాలను నగరంలోని సున్నిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీస్‌ కమిషనర్‌ దీన్‌ దయాళ్‌ తునేజా చెప్పారు. పంచ్‌ మహల్‌ జిల్లా లూనావాడ లో బుధవారం అర్థరాత్రి దోపిడీలు, విధ్వంసకర సంఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాజధాని నగరం అహ్మదాబాద్‌ లో కూడా కర్ఫ్యూ విధించారు. సబర్మతిరైలు మృతులకు సంతాపంగా గుజరాత్‌ అసెంబ్లీని శుక్రవారం నాటికి వాయిదా వేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X