బడ్జెట్‌పైవిపక్షాల విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్‌ను పేదలకు, రైతులకు వ్యతిరేకమైనదిగా ప్రతిపక్షాలువిమర్శించాయి. ఎల్‌పిజి, కిరోసిన్ ధరల పెంపు, ఎరువుల సబ్సిడీపై కోత ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్ర పక్షాలు కొన్నికోరాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో), అమెరికాలకు ప్రభుత్వం తల వంచిందని సిపిఎం నాయకుడు సోమనాథ్ ఛటర్జీవిమర్శించారు. మనం మన ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయామని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీలకు, కార్పోరేట్ హౌస్‌లకు
బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని, బడ్జెట్ ప్రతిపాదనల భారం ప్రజలపై పడుతుందని ఆయన అన్నారు. ఇది రైతులపై, నిరుపేదలపై, లఘు పరిశ్రమలపై యుద్ధ ప్రకటన అని ఆయన అన్నారు.
ఆర్థిక లోటును, నిరుద్యోగాన్ని అదుపు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకుండా పోయిందని రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు రఘువంశ్ ప్రసాధ్ అన్నారు. ఇది ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేకబడ్జెట్, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
