సాహసోపేతబడ్జెట్: ప్రధాని కితాబు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నెలకొన్నప్పటికీ 2002-03బడ్జెట్ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సాహసోపేతబడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపబోవని, ఉద్యోగావకాశాలను మెరుగు పరుస్తామని ఆయన గురువారం అన్నారు.
ఆర్థిక సంస్కరణలు అనివార్యమని, కానీ అభివృద్ధి కార్యక్రమాలుదెబ్బ తినకుండా చూస్తామని, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి సరిజోడుగా ముందుకు సాగేందుకుబడ్జెట్ ప్రతిపాదనలు గ్యారంటీ ఇస్తాయని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగానే ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నదని, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, రోడ్ల నిర్మాణ రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూబడ్జెట్ ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు. గరీబీ హటావో అనేది నినాదప్రాయంగానే మిగలకుండా వాస్తవరూపం దాలుస్తుందని ఆయన ప్రశంసించారు.












Click it and Unblock the Notifications
