విద్యుత్‌పైరభస-కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్‌ఃవిద్యుత్ ఛార్జీలను పెంచక తప్పదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ప్రకటనతో గురువారంఅసెంబ్లీ అట్టుడికిపోయింది. గత ఆరేళ్ళలో నాలుగు సార్లువిద్యుత్ చార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు మరోసారి చార్జీలనుపెంచేందుకు యత్నాలు చేస్తున్నదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.విద్యుత్ ఒప్పందాలను తిరిగి సమీక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు పోడియంవద్ద బైఠాయించడంతో సభా కార్యక్రమాలు స్తంభించి పోయాయి. దీంతో సభను టీవిరామం కోసం పది నిమిషాలు వాయిదా వేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. మూడు గంటలపాటు సభా కార్యక్రమాలు నిలిచిపోయాయి. పరిస్థితిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లుస్పీకర్ ప్రకటించారు.
ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని చంద్రబాబు నాయుడువిమర్శించారు. ప్రజలకు నచ్చచెప్పి, అనివార్య పరిస్థితుల్లోనేవిద్యుత్ చార్జీలు పెంచుతున్నామని, అయితే ప్రతిపక్షాలు దీనిని మసిపూసి మారేడుపండు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఇలా రౌడీయిజం చేయడం తగదని ఆయన ఆవేశంగా అన్నారు. ప్రతిపక్షాలు ఇందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మైసూరా రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి గందరగోళం సృష్టించడంతో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లుస్పీకర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications
