పొగమంచే ప్రమాదానికి కారణమా!
విజయవాడః భీమవరం నుంచి దక్కన్ ఎయిర్ వేస్ హెలికాప్టర్ లో బయలుదేరిన లోక్ సభస్పీకర్ బాలయోగి మరణానికి కారణం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పొగమంచు కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతోపైలట్ హెలికాప్టర్ ను కిందకి దించేందుకు ప్రయత్నించాడని, అది ఓ కొబ్బరి చెట్టును డీకొని చేపల చెరువు ఒడ్డును డీ కొట్టిందని తెలిసింది. హెలికాప్టర్ చేపల చెరువులో పడ్డా బతికే అవకాశాలుండేవని, చెరువు గట్టును డీ కొనడంతోస్పీకర్ తో సహా పైలట్, స్పీకర్ కార్యదర్శికి తలభాగంలో తీవ్రగాయాలయి మరణించారు.
ప్రమాదం జరగడానికి ముంది హెలికాప్టర్ 40 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు రికార్డయింది. భీమవరంలో బయలుదేరిన హెలికాప్టర్ టవర్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఆందోళన చెందిన అధికారులు హుటాహుటిన ఉన్నతాధికారులకు సమాచారంఅందించారు. కొద్దిసేపటికి బాలయోగి మరణ వార్త కోనసీమను కుదిపివేసింది.












Click it and Unblock the Notifications
