హెలికాప్టర్ కూలి బాలయోగి దుర్మరణం
హైదరాబాద్‌ఃలోక్ సభస్పీకర్, భారత దేశ తొలి దళిత లోక్ సభస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో మరణించారు. ఆదివారం ఉదయం 7.45 గంటలకు కృష్ణా జిల్లాకైకలూరు సమీపంలోని కొవ్వాడ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బాలయోగి ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. చెరువు గట్టున హెలికాప్టర్ దించేందుకుపైలట్ ప్రయత్నించాడు. అయితే హెలికాప్టర్ ప్రొఫెల్లర్ బ్లేడ్లు ఓ కొబ్బరి చెట్టుకు డీ కొనడంతో హెలికాప్టర్ చెరువులో కూలిపోయింది. దీంతో హెలికాప్టర్ లో వున్న బాలయోగి దుర్మరణం పాలయ్యారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ లో వున్న బాలయోగి సతీమణివిజయకుమారి, బాలయోగికుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు ఏలూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బాలయోగి భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ట్రస్ట్ కార్యాలయంలో బాలయోగి భౌతిక కాయాన్ని ప్రజలసందర్శనార్ధం వుంచుతారు.












Click it and Unblock the Notifications
